భయపెడుతున్న కాజల్ అగర్వాల్ ‘లైవ్ టెలికాస్ట్’

by  |
భయపెడుతున్న కాజల్ అగర్వాల్ ‘లైవ్ టెలికాస్ట్’
X

దిశ, వెబ్‌డెస్క్: అందాల చందమామ కాజల్ అగర్వాల్ వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో వస్తున్న ‘లైవ్ టెలికాస్ట్’ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. హాట్ స్టార్ ఒరిజినల్స్‌గా వచ్చేస్తున్న సిరీస్ వచ్చే నెల 12 నుంచి ప్రసారం కానుంది. లేటెస్ట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఓ టీవీ చానల్‌లో క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కాజల్ టీఆర్‌పీ రేటింగ్స్ పెంచే క్రమంలో దెయ్యాలపై ఓ షో ప్లాన్ చేస్తుంది. లైవ్‌లో దెయ్యాన్ని చూపించి ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయాలని అనుకుంటుంది.

ఈ క్రమంలో తన టీం సభ్యులచే డ్రామా ప్లాన్ చేయగా..దెయ్యం నిజంగానే తన పని మొదలుపెడుతుంది. దీంతో షూటింగ్ చేస్తోన్న ఇంట్లో అందరూ లాక్ అయిపోతారు. ఒకరి తర్వాత ఒకరు దెయ్యంగా మారుతుంటారు. ఇదంతా లైవ్ టెలికాస్ట్ జరుగుతుండగా..అసలు నిజంగా అక్కడ దెయ్యం ఉందా? లేక చానల్ వాళ్లు నాటకాలాడుతున్నారా? ఒకవేళ దెయ్యం ఉంటే అక్కడి నుంచి ఎలా బయటపడతారు? అనేది స్టోరి. వైభవ్, ఆనంది ప్రధానపాత్రల్లో నటించిన ‘లైవ్ టెలికాస్ట్’ తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

Next Story

Most Viewed