- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బీజేపీలో చేరిన రోజే ఈటలకు పరాభవం’
<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో.. ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఎందుకు చేరలేదని టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ప్రశ్నించారు. బీజేపీలో చేరిన రోజే ఈటల పరాభవం ఎదురైందని చెప్పారు. ఎవరిని ఉద్దరించేందుకు ఆ పార్టీలో చేరారో సమాధానం చెప్పాలని కడియం డిమాండ్ చేశారు. సోషలిస్టు భావాలు కలిగిన వ్యక్తి మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీతో ఎలా కలుస్తారని కడియం నిలదీశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. నాయకుల మీద ఉన్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో.. ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఎందుకు చేరలేదని టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ప్రశ్నించారు. బీజేపీలో చేరిన రోజే ఈటల పరాభవం ఎదురైందని చెప్పారు. ఎవరిని ఉద్దరించేందుకు ఆ పార్టీలో చేరారో సమాధానం చెప్పాలని కడియం డిమాండ్ చేశారు. సోషలిస్టు భావాలు కలిగిన వ్యక్తి మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీతో ఎలా కలుస్తారని కడియం నిలదీశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. నాయకుల మీద ఉన్న కేసులను సాకుగా చూపి లొంగదీసుకోవడం ఏంటన్నారు. అటువంటి పార్టీతో ఈటల చేరడం సిగ్గుచేటన్నారు. ఈటలకు కమ్యూనిస్టు భావజాలం ఎక్కడ పోయిందని.. అసలు ఫ్యూడల్ వ్యవస్థ గురించి మాట్లాడవచ్చా అంటూ కడియం శ్రీహరి మండిపడ్డారు.
Next Story






