న్యూడ్‌గా బాలీవుడ్ నటి ఫోజులు… నెటిజన్ల ప్రశంసలు

by  |
న్యూడ్‌గా బాలీవుడ్ నటి ఫోజులు… నెటిజన్ల ప్రశంసలు
X

దిశ,వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి న్యూడ్ ఫోటోలు దిగితే నెటిజన్లు ప్రశంల వర్షం ఎలా కురిపిస్తారని అనుకుంటున్నారా..? ఎస్. ఖచ్చితంగా ప్రశంసిస్తారు. ఎందుకంటే..? మనలో చాలా మందికి సన్నగా ఉండేందుకే ఇష్టపడుతుంటారు. లావుగా ఉంటే జీవితంలో అన్నీ కోల్పోయామని ఫీలవుతుంటారు. కానీ ఈమె మాత్రం బొద్దుగా ఉన్నా.. దేవుడిచ్చిన రూపం అంటూ సంతోషం వ్యక్తం చేస్తోంది. బాలీవుడ్ నటి వనితా ఖారత్. ఖారత్ హిందీ కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్‌తో కలిసి యాక్ట్ చేసింది. ఆ సినిమాలో పనిమనిషి క్యారెక్టర్ లో జీవించింది. అప్పటి వరకు మామూలు యాక్టర్ గా పేరున్న ఖారత్ కు..కబీర్ సింగ్ సినిమాలోని పని మనిషి క్యారెక్టర్ మంచి పేరు తెచ్చి పెట్టింది.
ఇక అసలు విషయానికొస్తే ఇటీవల ఖారత్ బాడీ షేమింగ్ ను వ్యతిరేకిస్తూ న్యూడ్ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. న్యూడ్ గా ఉన్న ఆమె శరీరం ముందు ఓ నీలి రంగు గాలి పటాన్ని ఉంచి ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి.
‘నాప్రతిభకు గర్వపడుతున్నాను, నా అభిరుచి, నా విశ్వాసం, నా శరీరం గురించి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను నేనే..’ అంటూ పోస్ట్ లో రాసింది. ఇక బోల్డ్ ఫోటోపై ఖారత్ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. అందం, ఆకారం గురించి దిగులు పడకుండా పాజిటివ్ మూవ్‌మెంట్‌లో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు.


Next Story

Most Viewed