జస్టిస్ ఈశ్వరయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

by  |
జస్టిస్ ఈశ్వరయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
X

దిశ, వెబ్‌డెస్క్: రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. జస్టిస్ ఈశ్వరయ్య న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యలపై.. హైకోర్టు విచారణపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

జడ్జి రామకృష్ణతో మాట్లాడిన మాట నిజమేనని జస్టిస్ ఈశ్వరయ్య తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంగీకరించారు. ఫోన్ సంభాషణపై ఆఫిడవిట్ దాఖలు చేయాలని ప్రశాంత్ భూషణ్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల ప్రైవేట్ సంభాషణలపై విచారణ అవసరం లేదని ప్రశాంత్ భూషణ్ వాదించారు. అయితే రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించాలని కపిల్ సిబల్ వాదించారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.


Next Story

Most Viewed