రియల్ లైఫ్ మోగ్లీ.. పదేళ్లు తోడేళ్ల సంరక్షణలోనే పెరిగిన బాలుడు

by Shyam |

<p>దిశ, ఫీచర్స్ : పుట్టినప్పుడే తల్లిదండ్రులు వదిలేసిన లేదా ఇంట్లోని హింసాత్మక పరిస్థితులను తప్పించుకుని అడవిలో ఆశ్రయం పొందుతున్న పిల్లలను క్రూరులుగానే పిలుస్తారు. నాగరికతకు దూరంగా, పూర్తిగా ఒంటరిగా పెరిగిన అలాంటి పిల్లల్ని మానవ సమాజంలో భాగం చేసినా జంతువుల మాదిరే ప్రవర్తిస్తుంటారు. ‘దినా సానిచార్’ అనే బాలుడు కూడా అదే కోవకు చెందినవాడే కాగా.. జంగిల్ బుక్‌లోని ‘మోగ్లీ’ క్యారెక్టర్‌కు స్ఫూర్తి అతడేనన్న ప్రచారమూ లేకపోలేదు. ఆ ప్రత్యేక మానవుడి గురించి కొన్ని వివరాలు.. అడవిలోకి [&hellip;]</p>

Dina Sanichar
X

దిశ, ఫీచర్స్ : పుట్టినప్పుడే తల్లిదండ్రులు వదిలేసిన లేదా ఇంట్లోని హింసాత్మక పరిస్థితులను తప్పించుకుని అడవిలో ఆశ్రయం పొందుతున్న పిల్లలను క్రూరులుగానే పిలుస్తారు. నాగరికతకు దూరంగా, పూర్తిగా ఒంటరిగా పెరిగిన అలాంటి పిల్లల్ని మానవ సమాజంలో భాగం చేసినా జంతువుల మాదిరే ప్రవర్తిస్తుంటారు. ‘దినా సానిచార్’ అనే బాలుడు కూడా అదే కోవకు చెందినవాడే కాగా.. జంగిల్ బుక్‌లోని ‘మోగ్లీ’ క్యారెక్టర్‌కు స్ఫూర్తి అతడేనన్న ప్రచారమూ లేకపోలేదు. ఆ ప్రత్యేక మానవుడి గురించి కొన్ని వివరాలు..

అడవిలోకి ఎలా వెళ్లాడు?

1872లో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నగర ప్రాంతంలో వేటగాళ్లకు ఒక గుహలో అడవి మృగాన్ని తోడేళ్లు గుంపు చుట్టుమట్టిన దృశ్యం కనిపించింది. అయితే ఆ తోడేళ్ల గుంపును వేటాడిన వేటగాళ్లకు అక్కడ 10 ఏళ్ల వయసున్న పిల్లోడు కనిపించాడు. అతడు నాలుగు కాళ్లపై అడవి జంతువులా నడుస్తూ వాళ్లను ఆశ్చర్యపరిచాడు. ఈ వేటలో ఆ బాలుడిని తల్లిలా సాకుతున్న ‘తోడేలు’ చనిపోవడంతో వేటగాళ్ళు అతన్ని ఆగ్రాలోని అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. ఇక్కడే తనకు ‘దినా సానిచార్’ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత మానవ సమాజంలో కలిసిపోవాల్సి వచ్చింది. ఇందులో వింతేముంది అంటారా? ఉంది.

Dina Sanichar2

నాలుగు కాళ్లపై నడకను అదేవిధంగా కొనసాగించిన సానిచార్.. పచ్చి మాంసం తినే తన అలవాటును మార్చుకోలేదు. బట్టలు ధరించడం వంటి ఇతరత్రా మానవ అలవాట్లను అసహ్యించుకున్నాడు. మనుషుల భాషకు సంబంధించిన ఏ ఒక్క పదం కూడా మాట్లాడటం నేర్చుకోలేదు. ఇతర మనుషులతో బాండింగ్ ఏర్పరచుకోవడం అతనికి సాధ్యపడలేదు. కానీ తోడేళ్ళు పెంచిన మరొక బిడ్డనే అతనికి స్నేహితుడు కాగలిగాడు. కానీ ఈ స్నేహం ఎక్కువ కాలం కొనసాగలేదు. అనాథ శరణాలయానికి తీసుకొచ్చిన ఆ బిడ్డ నెలల వ్యవధిలోనే చనిపోయాడు.

అతనికి ఏమైంది?

మానవ జీవన ప్రమాణాల ప్రకారం సానిచార్ కథ చాలా విశేషమైంది. క్రూరమైన పిల్లల్లో యుక్త వయసు వరకు బతికినవారిలో అతడు మొదటివాడు కాగా.. 34 ఏళ్లు జీవించాడు. ఈ క్రమంలో వండిన ఆహారాన్ని తినేందుకు అలవాటుపడ్డ సానిచార్.. తినేముందు మాత్రం ఒక జంతువు మాదిరే తన ప్లేట్‌ను వాసన చూసేవాడు. చివరకు కాళ్లపై నడవడం కూడా ప్రారంభించాడు. అయితే ధూమపానానికి అడిక్ట్ అయిన తను.. చైన్-స్మోకర్‌గా మారాడు. అతని మరణానికి ఈ వ్యసనం కూడా కారణం కాగా.. 1895లో క్షయవ్యాధితో మరణించాడు. కాగా ఐరిష్ జియాలజిస్ట్ వాలెంటైన్ బాల్.. 19వ శతాబ్దం చివరన ‘జంగిల్ లైఫ్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో సానిచర్ కేసును డాక్యుమెంట్ చేశారు. కాగా రుడ్‌యార్డ్ కిపింగ్ రాసిన ‘ది జంగిల్ బుక్‌’లోని మోగ్లీ పాత్రకు కూడా సానిచార్ స్ఫూర్తి అని ప్రచారంలో ఉంది.

Next Story