‘తొక్క’లో ఉపాయం చెబితే రూ. 7.3 కోట్లు

by  |
‘తొక్క’లో ఉపాయం చెబితే రూ. 7.3 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : సీజన్‌తో సంబంధం లేకుండా, వయోభేదాలు పట్టించుకోకుండా.. అందరూ ‘జ్యూస్’‌లు తాగడానికి ఇష్టపడతారు. అయితే, ఎక్కడైనా సరే.. జ్యూస్ చేశాక వాటి తొక్కలను, వ్యర్థాలను పడేస్తాం. జ్యూస్ షాపుల్లోనైనా లేదా మనం ఇంట్లో జ్యూస్ చేసుకున్నా.. తొక్కలు, పండ్ల వ్యర్థాలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అదే పెద్ద జ్యూస్ కంపెనీ అనుకోండి.. అవి టన్నుల్లో పొగవుతాయి. అమెరికాకు చెందిన ఓ కంపెనీకి కూడా అలాంటి సమస్యే వచ్చింది. దానిమ్మ జ్యూస్ తయారు చేసే ఆ కంపెనీ.. ఏటా కొన్ని వందల టన్నుల దానిమ్మ వ్యర్థాలను వృథా చేస్తోంది. అయితే, వాటిని దేనికైనా వినియోగించేలా ఉపాయాన్ని సూచిస్తే.. ఆ కంపెనీ ఏకంగా రూ. 7.3 కోట్లు బహుమతిగా ఇస్తానంటోంది?

కాలిఫోర్నియా, లాస్‌ఏంజిల్స్‌కు చెందిన ‘ద వండర్‌ఫుల్ కంపెనీ’ దానిమ్మ జ్యూస్‌లను తయారు చేస్తోంది. అందుకు ఏటా సుమారు 50 వేల టన్నుల దానిమ్మ పండ్లను వినియోగిస్తోంది. కాగా, అంతే మొత్తంలో వ్యర్థాలు కూడా పోగవుతున్నాయి. ఆ తొక్కలు, వ్యర్థాలను వృథా చేయకుండా, పర్యావరణ హితంగా ఉపయోగించేలా.. ఏదైనా పరిష్కారం చూపించగలిగితే 1 మిలియన్ డాలర్లు (రూ. 7.3కోట్లు) బహుమతిగా ఇస్తామంటూ ‘వండర్ ఫుల్ ఇన్నోవేషన్ చాలెంజ్’ పేరిట సవాల్ విసిరింది.

స్వచ్ఛంద సంస్థ ‘రీఫెడ్’(ReFED )తో కలిసి వండర్‌ఫుల్ కంపెనీ ఈ చాలెంజ్‌ను ప్రారంభించగా.. సింగిల్‌గా లేదా ఓ బృందంగా ఏర్పడి ఈ సమస్యకు పరిష్కారం చూపించొచ్చు. మొత్తంగా ఫైనల్ వరకు వెళ్లాలంటే.. నాలుగు స్టేజ్‌లు దాటాల్సి ఉంటుంది. విజేతలుగా నిలిచిన గ్రూప్ ఆఫ్ మెంబర్స్‌కు అవసరమైన వనరులు సమకూర్చడంతో పాటు, వాళ్ల బిజినెస్ వృద్ధి చెందేలా తామే చూసుకుంటామని వండర్ ఫుల్ కంపెనీ పేర్కొంది. ఈ పోటీలో పాల్గొనేందుకు డిసెంబర్ 7వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.



Next Story

Most Viewed