జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలి.. పోచారం

by  |
జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలి.. పోచారం
X

దిశ, తెలంగాణ బ్యూరో : జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పోచారం నివాసంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను టీయూడబ్ల్యూజే (ఏజేయూ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ విష్ణుదాస్ శ్రీకాంత్ వివరించారు.

స్పందించిన స్పీకర్ పోచారం.. జర్నలిస్టులను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ లిస్టులో చేర్చడమేగాకుండా వారియర్స్‌కు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో అవి కల్పించాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం, చైతన్యంతో పాటు నివారణకు తీసుకోవాల్సిన సూచనలు చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. వారికి ఆర్ధిక, ఆరోగ్య, శారీరకంగా ఇబ్బందులు వస్తే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ప్రచార సాధనలలో జర్నలిస్టుల పాత్ర అమోఘమని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఉద్యోగ రీత్యా పారామెడికల్ స్టాఫ్, పోలీసులు, ఆశవర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, పారిశుధ్య కార్మికులతో పాటు కొవిడ్‌ను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు.


Next Story

Most Viewed