- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు భరోసా ఇవ్వాలి
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు భరోసా ఇవ్వాలని జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ అన్నారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీంలో కరోనా వైద్యాన్ని చేర్చాలని కోరుతూ సోమవారం మంత్రి ఈటల రాజేందర్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు వైరస్ బారినపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా పల్లె రవికుమార్ మంత్రికి వివరించారు. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ మెరుగైన వైద్యం పొందేలా తక్షణమే ఆరోగ్యశ్రీలో కరోనాను […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు భరోసా ఇవ్వాలని జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ అన్నారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీంలో కరోనా వైద్యాన్ని చేర్చాలని కోరుతూ సోమవారం మంత్రి ఈటల రాజేందర్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు వైరస్ బారినపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా పల్లె రవికుమార్ మంత్రికి వివరించారు. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ మెరుగైన వైద్యం పొందేలా తక్షణమే ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చి ఆదుకోవాలన్నారు. గాంధీ ఆస్పత్రికి పేషెంట్ల రద్దీని తగ్గించడంతోపాటు సౌకర్యాలను మెరుగు పరచాలన్నారు.
Next Story






