రోడ్డుపై అభిమాని ఫోన్ లాక్కున్న స్టార్ హీరో.. వీడియో వైరల్

by  |
రోడ్డుపై అభిమాని ఫోన్ లాక్కున్న స్టార్ హీరో.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: రోడ్డు మీద వెళ్తున్నపుడు అనుకోకుండా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఆనందంతో గంతులేస్తారు. వెంటనే ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీస్తూనే ఉంటారు. అవకాశం ఉంటే సెల్ఫీ కోసం ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఇలాంటి సరదా సన్నివేశం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో జాన్‌ అబ్రహం జిమ్ నుంచి వస్తూ తన ఫ్రెండ్‌తో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఓ ఇద్దరు యువకులు తమ బైక్ మీద కూర్చుని జాన్ అబ్రహం నడిచొస్తున్న సెల్ఫీ వీడియో రికార్డు చేస్తున్నారు.

అయితే అనుకోకుండా అటువైపు చూసిన జాన్.. వాళ్ల దగ్గరకు వేగంగా నడుచుకుంటూ వచ్చి వాళ్ల చేతుల్లోంచి ఫోన్‌ లాక్కుని పరిగెత్తాడు. అంతే.. ఒక్కసారిగా షాక్ తిన్న ఆ యువకులు జాన్ వెంట పడ్డారు. అయితే ఆ ఫోన్ లాక్కున్న హీరో మాత్రం కెమెరా వైపు చూస్తూ.. ‘హాయ్ గాయ్స్ ఇప్పుడు ఓకేనా..?’ అంటూ నవ్వుతూ సంభాషించడం విశేషం. ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన అభిమాని.. ‘మా అబ్బాయి జాన్‌కి 48 ఏళ్లు.. చాలా సింపుల్ మ్యాన్, దయగల వ్యక్తి. లవ్ యూ బాబా’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా జాన్ చేసిన పనిని నెటిజన్లు కొనియాడుతున్నారు.

బిడ్డ పుట్టగానే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిన నటి.

Photo :


Next Story

Most Viewed