షూటింగ్‌లో గాయపడ్డ జాన్ అబ్రహం

by  |
షూటింగ్‌లో గాయపడ్డ జాన్ అబ్రహం
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం షూటింగ్‌లో గాయపడ్డారు. ‘సత్యమేవ జయతే 2’ షూటింగ్ కంప్లీట్ చేసి, రీసెంట్‌గా ‘అటాక్’ సినిమా చిత్రీకరణ ప్రారంభించిన జాన్.. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు గాయపడిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. లైట్‌తో తన మెడపై కొట్టిన పిక్చర్ షేర్ చేసిన హీరో.. దాని వల్ల కలిగిన గాయాలకు రక్తం తుడుచుకుంటున్న వీడియోను యాడ్ చేశాడు. ‘ఎలా ప్రారంభమైంది.. ఇప్పుడు ఏం జరుగుతోంది.. లవ్ దిస్.. ఆల్ పార్ట్ ఆఫ్ ఫన్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు క్యాప్షన్ జత చేశాడు. ఇక ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్‌ నుంచి షేర్ చేసిన బైక్ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.



Next Story

Most Viewed