అమితాబ్‌‌ను పట్టుకుని ఏడ్చేసిన స్టార్ హీరో.. వీడియో వైరల్ 

by  |
అమితాబ్‌‌ను పట్టుకుని ఏడ్చేసిన స్టార్ హీరో.. వీడియో వైరల్ 
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రస్తుతం ‘సత్యమేవ జయతే 2’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ దివ్యా ఖోస్లా కుమార్‌తో కలిసి ‘కౌన్ బనేగా క్రోర్‌పతి 13 ’ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌తో కలిసి షోలో నవ్వుల పువ్వులు పూయించిన జాన్.. ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు. బైక్ రైడింగ్, అభిషేక్ బచ్చన్‌తో ఫ్రెండ్ షిప్, బచ్చన్ ఫ్యామిలీతో అనుబంధం గురించి చర్చించిన ఆయన.. బాడీ ఫిట్‌నెస్ గురించి అడగ్గానే షర్ట్ విప్పేసి సిక్స్ ప్యాక్స్ చూపించి ఆడియన్స్‌కు హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్మెంట్ అందించాడు. కానీ తన లైఫ్ గురించి వివరిస్తూ ఒక్కసారిగా డౌన్ అయిపోయి ఏడ్చేశాడు. ఇంతకీ జాన్ ఎందుకంత భావోద్వేగానికి గురయ్యాడో ఈ షో ప్రోమోలో చూపించలేదు కానీ ఆయన కన్నీరు పెట్టుకోవడం చూసి అభిమానులు బాధపడిపోతున్నారు.



Next Story

Most Viewed