పాప్ సింగర్ జో జోనస్.. బిగ్ స్క్రీన్ ఎంట్రీ

38

దిశ, వెబ్‌డెస్క్ :  హాలీవుడ్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘డివోషన్’తో అమెరికన్ పాప్ సింగర్ జో జోనస్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అమెరికాకు చెందిన ట్రూ ఫైటర్ పైలట్స్ ‘జెస్సీ లేరాయ్ బ్రౌన్, టామ్ హండ్నెర్‌’ రియల్ ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకొని ఈ సినిమా రూపొందుతోంది.

వీఎఫ్-32 స్క్వాడ్రన్ ఫైటర్ జెట్స్ నడిపే పైలెట్స్ జెస్సీ, టామ్‌లలో ఒకరు అనుకోకుండా వారి దేశ పరిమితులు దాటి, శత్రుదేశానికి చెందిన బార్డర్స్ క్రాస్ చేస్తారు. దాంతో అతడ్ని శత్రుసేనలు కాల్చేయగా, ఆ క్షణం మరో స్నేహితునికి అసలైన పరీక్ష మొదలవుతుంది. తర్వాత ఆ స్నేహితుడు ఏం చేశాడన్నదే ఈ సినిమా కథాంశమని హాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ వార్ డ్రామాలో జో జోనస్.. కీ రోల్ పోషిస్తుండగా, హాలీవుడ్ యాక్టర్స్ జొనాథన్ మేజర్స్, గ్లెన్ పావెల్‌, థామస్ సడోస్కి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్టియానా జాక్సన్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ‘డివోషన్’మూవీకి జేడీ డిల్లార్డ్ దర్శకత్వం వహిస్తుండగా.. జేక్ క్రేన్, జోనాథన్ ఏ స్టీవర్ట్‌లు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కాగా అమెరికన్ సింగర్ జో జోనస్.. తన బ్రదర్స్ కెవిన్, నిక్‌తో కలిసి ప్రారంభించిన పాప్ బ్యాండ్ ‘జోనస్ బ్రదర్స్’తో ఫుల్ పాపులారిటీ సంపాదించాడు.