షార్ శ్రీహరికోటలో 94 టెక్నీషియన్ పోస్టులు

by Disha Web Desk 17 |
షార్ శ్రీహరికోటలో 94 టెక్నీషియన్ పోస్టులు
X

దిశ, కెరీర్: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్), వివిధ విభాగాల్లో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మే 16లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 94

పోస్టుల వివరాలు:

టెక్నీషియన్ అసిస్టెంట్ - 12

లైబ్రరీ అసిస్టెంట్ ఎ - 2

సైంటిఫిక్ అసిస్టెంట్ - 6

టెక్నీషియన్ -బి /డ్రాఫ్ట్స్ మ్యాన్ -బి - 74

అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్ఏసీ, డిప్లొమా, ఢిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: మే 16, 2023 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు టెక్నికల్ అసిస్టెంట్/సైంటిఫిక్ అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు రూ. 44,900 నుంచి రూ. 1,42, 400 ఉంటుంది.

టెక్నీషియన్/డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు రూ. 21,700 నుంచి 69,100 ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: పోస్టులను అనుసరించి రూ. 600/రూ. 1000 చెల్లించాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మే 16, 2023.

వెబ్‌సైట్: https://www.shar.gov.in


ఇవి కూడా చదవండి:

నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్‌లో 163 ఖాళీలు



Next Story

Most Viewed