- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > కెరీర్ > Job Notifications > గురుకులాల్లో 11,012 టీచర్ పోస్టుల భర్తీ.. నెలాఖరులోగా నోటిఫికేషన్
గురుకులాల్లో 11,012 టీచర్ పోస్టుల భర్తీ.. నెలాఖరులోగా నోటిఫికేషన్
by Harish |
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.

X
దిశ, కెరీర్: తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా గురుకుల నియామక బోర్డు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. గురుకులాల్లో అనుమతించిన 11,012 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి..రాత పరీక్ష నాటికి అదనంగా మంజూరు కానున్న పోస్టులకు అనుబంధ ప్రకటనలు ఇవ్వనున్నారు.
ప్రస్తుతం గురుకుల సొసైటీలు ఉద్యోగ ప్రకటనల జారీకి అవసరమైన సమాచారాన్ని గురుకుల బోర్డుకు అందజేశాయి. ఈ మేరకు మార్చి నెలాఖరు నాటికి నోటిఫికేషన్లు జారీ చేయాలని బోర్డు భావిస్తోంది. ప్రకటన వెలువడిన నాటి నుండి రాత పరీక్ష నిర్వహణ తేదీకి మధ్య కనీసం నాలుగు నెలల వ్యవధి ఉండాలని భావిస్తోంది. 2023 -24 విద్యా సంవత్సరం నాటికి ఈ నియామకాలు పూర్తి చేయాలని బోర్డు భావిస్తోంది.
Next Story






