ఈ అర్హతలుంటే చాలు.. రాత పరీక్ష లేకుండా నేవీలో ఆఫీసర్ ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
ఈ అర్హతలుంటే చాలు.. రాత పరీక్ష లేకుండా నేవీలో ఆఫీసర్ ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లో 2024, జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత, పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.

కోర్సు వివరాలు :

షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆఫీసర్ - జనవరి 2024

ఖాళీల వివరాలు :

జనరల్ సర్వీస్ - 50

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ - 10

నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ - 20

పైలట్ - 25

లాజిస్టిక్స్ - 30

నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టర్ కేడర్ - 15

ఎడ్యుకేషన్ - 12

ఇంజనీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) - 20

ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) - 60

మొత్తం ఖాళీలు: 227

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక /వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వేతనం: నెలకు రూ. 56,100 తో పాటు ఇతర అలవెన్సులుంటాయి.

ఎంపిక: విద్యార్హతలలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: మే 14, 2023.

వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in



Next Story