SSC CHSLలో పెరిగిన పోస్టులు.. ఎన్నంటే

by Disha Web Desk 17 |
SSC CHSLలో పెరిగిన పోస్టులు.. ఎన్నంటే
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి SSC(స్టాఫ్ సెలక్షన్ కమిషన్) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్(CHSL) 2023 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో 1600 ఖాళీలు ఉన్నట్లు పేర్కొనగా, తాజాగా వాటిని పెంచారు. ప్రస్తుతం మొత్తం ఖాళీలను 1762 గా పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో జూనియర్ సెక్రటేరియట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మొదలగు పోస్టులను భర్తీ చేస్తారు. మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆగస్టులో టైర్ 1 పరీక్షలు నిర్వహించారు. త్వరలో టైర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు.


Next Story

Most Viewed