- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1104 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. పదవ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అర్హులు కాగా మొత్తం 1104 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరింది.

దిశ, వెబ్ డెస్క్ : గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ గోరఖ్‌పూర్ గుడ్ న్యూస్ చెప్పింది. పదవ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అర్హులు కాగా మొత్తం 1104 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరింది. అక్టోబర్ 16 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతుండగా.. చివరి తేదీ నవంబర్ 15. www.ner.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో అప్లయ్ చేయాల్సి ఉంది. ఎంపికైన అభ్యర్థులను రైల్వేలోని పలు విభాగాల్లో అప్రెంటీస్‌లుగా నియమించబడతారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50శాతం మార్కులతో ఎస్‌ఎస్‌సీ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 16 అక్టోబర్ 2025 నాటికి కనీసం 15 సంవత్సరాలు, గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తుకు ఎలాంటి ఫీజు రుసుము లేదు.






