- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1226 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు
తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రకటన విడుదల చేసింది.

దిశ, కెరీర్: తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రకటన విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
ఆఫీస్ సబార్డినేట్ - 1226
జిల్లాల వారీగా ఖాళీలు:
ఆదిలాబాద్ - 10
భద్రాద్రి కొత్తగూడెం - 19
జగిత్యాల -36
సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్ - 26
హనుమకొండ - 19
జగిత్యాల -32
జనగామ - 13
జయశంకర్ భూపాలపల్లి - 18
జోగులాంబ గద్వాల - 25
కామారెడ్డి -14
కరీంనగర్ -12
ఖమ్మం -13
కుమ్రంభీం ఆసిఫాబాద్ - 11
మహబూబాబాద్ -13
మంచిర్యాల -14
మహబూబ్‌నగర్ - 33
మెదక్ - 16
మేడ్చల్ మల్కాజిగిరి -92
మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, హైదరాబాద్ - 128
ములుగు -14
నాగర్ కర్నూలు -28
నల్గొండ -55
నారాయణపేట - 11
నిర్మల్ -18
నిజామాబాద్ -20
పెద్దపల్లి -41
రాజన్న సిరిసిల్ల - 28
రంగారెడ్డి - 150
సంగారెడ్డి - 30
సిద్దిపేట -25
సూర్యాపేట - 38
వికారాబాద్ - 27
వనపర్తి - 19
వరంగల్ - 21
యాదాద్రి భువనగిరి - 34
అర్హత: 7వ తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే అనర్హులు.
స్థానిక భాష తెలిసి ఉండాలి.
వయసు: జులై 1, 2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ. 19,000 నుంచి రూ. 58,850 చెల్లిస్తారు.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ఓఎమ్మార్ పరీక్ష, ఇంటర్వ్యూ ..ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం:
సీబీటీ లేదా ఓఎమ్మార్ పరీక్షలో 45 ప్రశ్నలుంటాయి.
జనరల్ నాలెడ్జ్ విభాగంలో 35
జనరల్ ఇంగ్లిష్ విభాగంలో 15 ప్రశ్నలుంటాయి.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 11, 2023.
చివరి తేదీ: జనవరి 31, 2023.
సీబీటీ ఆధారిత పరీక్ష: మార్చి 2023.
వెబ్‌సైట్: https://tshc.gov.in






