SSBలో 18 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు

by Dishafeatures2 |
SSBలో 18 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
X

దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్‌బీ).. అసిస్టెంట్ కమాండెంట్ (వెటర్నరీ)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారు దేశ వ్యాప్తంగా ఎస్ఎస్‌బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

అసిస్టెంట్ కమాండెంట్ (వెటర్నరీ -గ్రూప్ ఎ గెజిటెడ్ ) - 18 పోస్టులు

అర్హత: బీవీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 56,100 నుంచి 1,77,500 ఉంటుంది.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 400 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in/


Next Story