- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
15 వేలకు పైగా టీచర్ పోస్టులు.. త్వరలో DSC నోటిఫికేషన్..?
by Harish |
ఏపీలో విద్యా సంవత్సరానికి అంతరాయం కలగకుండా ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

X
దిశ, కెరీర్: ఏపీలో విద్యా సంవత్సరానికి అంతరాయం కలగకుండా ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీఎంతో చర్చించి సాధ్యమైనంత త్వరగా విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే టీచర్ల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. విద్యారంగంలోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో భాగంగా డీఎస్సీ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టీచర్ల ఖాళీల లెక్కలు తీస్తున్నామని.. దాదాపు 15,000కు పైనే ఖాళీలున్నాయని తెలిపారు. త్వరలో డీఎస్సీపై ప్రకటన చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.
Next Story






