గ్రూప్ - 1 మెయిన్స్: సబ్జెక్టు కంటే స్ట్రాటజీ ముఖ్యం

by Disha Web Desk 17 |
గ్రూప్ - 1 మెయిన్స్: సబ్జెక్టు కంటే స్ట్రాటజీ ముఖ్యం
X

అవగాహన, ఆలోచన, ఆచరణ ఉంటే గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్ష సులువవుతుంది. గ్రూప్ -1లో మొత్తం 6 పేపర్లు ఉంటాయి. వీటితోపాటు జనరల్ ఇంగ్లిష్ క్వాలిఫై పేపర్ గా ఉంటుంది.

పేపర్ - 1 జనరల్ ఎస్సే:

జనరల్ ఎస్సే కోసం ప్రత్యేకంగా చదవవలసిన అవసరం లేదు కానీ, ప్రాక్టీస్ మాత్రం తప్పనిసరిగా చేయాలి.

దీనిలో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు 2 సబ్జెక్టులుంటాయి.

సంపూర్ణంగా అవగాహన ఉన్న సబ్జెక్టును ఎంపిక చేసుకోవడం ఉత్తమం

ప్రతి సెక్షన్‌లోనూ మీ డిగ్రీలో చదివిన లేదా సాధారణంగా అవగాహన ఉన్న సబ్జెక్టును ఎంచుకోవాలి.

ఉదాహరణకు సెక్షన్ 2లో భారత రాజకీయ లేదా భారతదేశ చారిత్రక, సాంస్కృతిక సంపద అంశాలు ఉంటాయి. చరిత్ర మీద మంచి పట్టు ఉంటే రెండో దాన్ని ఎంచుకోవడం ఉత్తమం

పేపర్ -2 : సెక్షన్ - 1 (భారత దేశ చరిత్ర, ముఖ్యంగా ఆధునిక చరిత్ర):

డిగ్రీలో చరిత్ర నేపథ్యం లేని అభ్యర్థులకు ఈ సెక్షన్ చదవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కారణం ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు రెండు యూనిట్లలో ఎక్కువ సమయం కోల్పోవలసి ఉంటుంది. కాబట్టి మంచి వ్యూహంతో చదివితే సులభం అవుతుంది.

3,4,5 యూనిట్లు ఆధునిక చరత్రకు సంబంధించినవి.

చరిత్రకు సంబంధించి ప్రామాణికమైన పుస్తకాలను చదివి సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. రోజుకు కనీసం ఐదు ప్రశ్నలను రాసి సంబంధిత సబ్జెక్టు ఎక్స్ పర్ట్ తో కరెక్షన్ చేయించుకుంటే అందరికంటే మంచి స్కోరు సాధించవచ్చు. ప్రతి ప్రశ్నకు 1 లేదా 2 మార్కులు అదనంగా పొందే అవకాశం ఉంటుంది.

చరిత్ర సబ్జెక్టుకు సంబంధించి కీ పదాలు చాలా ముఖ్యంగా ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోకపోతే సమాధానం పక్కదారి పడుతుంది.

కీ పదాలు..అంటే ఉదాహరణకు 'వర్ణించండి' అని అన్నప్పుడు వివరించకూడదు..ఒక్క మాటలో చెప్పాలంటే వర్ణించండి అంటే సాధ్యమైనంతవరకు వాస్తవ ఆధారాలతో సమాధానం రాయాలి.

పేపర్ -2, సెక్షన్ - 2: (తెలంగాణ చరిత్ర, ముఖ్యంగా ఆధునిక చరిత్ర) :

ప్రాచీన తెలంగాణ చరిత్రకు సంబంధించి స్టాండర్డ్ పుస్తకాలను మాత్రమే చదవాలి. ఎందుకంటే లోకల్ పుస్తకాలలో చాలా వరకు ప్రామాణికమైన సమాచారం లేదు.

చరిత్ర సబ్జెక్టును బాగా అవగాహన చేసుకుంటే గాని సమాధానం సరిగ్గా రాయలేము. ఉదాహరణకు హెరిటేజ్ గురించి రాయమంటే హెరిటేజ్ అనే పదాన్ని బ్రాడ్ గా అర్థం చేసుకోవాలి.

'అసఫ్ జాహీ వంశం' గురించి నేర్చుకోవడం అంటే మొత్తం నేర్చుకోవడం కాదు.

సిలబస్ లో ఉన్న అంశాన్ని మాత్రమే చదవాలి. ఉదాహరణకు ఆరవ నిజాం, ఏడవ నిజాం పాలనలో సామాజిక - ఆర్థిక అభివృద్ధి గురించి మాత్రమే చదవాలి.

అంతేగాని మరో అంశం మీద దృష్టి పెట్టకూడదు.

'నిర్మాణం'అనేది చాలా ముఖ్యం. నిర్మాణం అంటే ఒక ప్రశ్నకు ప్రారంభం, బాడీపార్ట్, ముగింపు సరైన పద్ధతిలో రాయాలి.

ఆధునిక తెలంగాణ చరిత్రలో కొన్ని అంశాలు తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా ఉన్నాయి అని అనుకుంటారు.

కానీ వాస్తవంగా సిలబస్ ఇచ్చిన అంశాలు వేర్వేరు.

అధ్యయనం వేరు, దీనిలోని ఉప అంశం వేరు అనే విషయాన్ని జాగ్రత్తగా చూసి చదువుకోవాలి.

ఆధునిక తెలంగాణ చరిత్రలో కొన్ని అంశాల మీద ముఖ్యంగా ఫోకస్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ చర్య, భారత యూనియన్ లో హైదరాబాద్ విలీనం.. వంటివి.

పేపర్ - 2, సెక్షన్ - 3 (భారతదేశ, తెలంగాణ జాగ్రఫీ):

ఈ సెక్షన్ లో భారతదేశ జాగ్రఫీ పై రెండు యూనిట్లు మాత్రమే ఉంటాయి.

కానీ సిలబస్ లో మాత్రం మొత్తం సబ్జెక్టు ఉంది.

భారతదేశ జాగ్రఫీ లో మొదటి యూనిట్ లో విస్తృతంగా సిలబస్ ఉంటే, రెండో యూనిట్ లో పరిమితంగా మాత్రమే ఉంది.

అయితే గ్రూప్ - 1 సిలబస్‌ను సగం మాత్రమే చదివితే సరిపోతుంది. అనే భావన నుండి ముందుగా బయటపడాలి.

పూర్తి సబ్జెక్టు మీద పట్టు ఉంటే కానీ మనం విజయం సాధించలేము అనే విషయాన్ని తెలుసుకోవాలి.

తెలంగాణ జాగ్రఫీ పైన జరుగుతున్న తొలి వ్యాసరూప గ్రూప్ - 1 పరీక్ష.. కాబట్టి కొన్ని అంశాలను ముఖ్యంగా ఫోకస్ చేయాలి. ఉదాహరణకు జనాభా, పరిశ్రమలు, వలసీకరణ, నేలలు, ఖనిజాలు మొదలైనవి .

పేపర్ - 3, సెక్షన్ - 1 (భారతీయ సమాజం):

ఈ సెక్షన్ సిలబస్ కూడా చాలా విస్తృతంగా ఉంది. అయితే తెలంగాణ అంశాలు మాత్రం 2 యూనిట్లలో ఉంటే, మిగతా అంశాలు 3 యూనిట్లలో ఉన్నాయి.

ఒక యూనిట్ లో పూర్తిగా తెలంగాణ అంశాలు ఉంటే, మరో యూనిట్ లో తెలంగాణ.. భారతదేశ సామాజిక విధానం, పథకాలు ఉన్నాయి.

సెక్షన్ లో రెండు యూనిట్లు సులభంగా ఉంటే, ఒక యూనిట్ మాత్రం పూర్తిగా కఠినమైన అంశాలతో కూడి ఉంది.

సమాజిక సమస్యలకు సంబంధించి యూనిట్‌లో విస్తృతమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యూనిట్ చాలా కఠినంగా ఉండటంతో పాటు చదివేటప్పుడు అధిక సమయాన్ని కూడా వెచ్చించవలసి ఉంటుంది.

పేపర్ -3, సెక్షన్ -2 (భారత రాజ్యాంగం):

ఈ సబ్జెక్ట్ స్వభావం ఏమిటంటే చదివేటప్పుడు సులువుగా ఉండి, రాసేటప్పుడు టఫ్ గా ఉంటుంది. కారణం ఏమిటంటే రాజ్యాంగ పరమైన అంశాలు ఇమిడి ఉండటం తో పాటు కొన్ని సార్లు కేసులను కూడా కోట్ చేయవలసి ఉంటుంది.

ఈ సెక్షన్ తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు, కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది.

రాజ్యాంగం పైన డైరెక్ట్ ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా ఒకటి కంటే ఎక్కువ ఉండకపోవచ్చు.

అత్యధిక ప్రశ్నలు పరోక్షంగా మాత్రమే వస్తాయి. ముఖ్యంగా అప్లికేషన్ పద్ధతిలో ఉంటుంది.

డిడి బసు స్థాయి పుస్తకాన్ని అర్థం చేసుకుంటే 3 యూనిట్లకు సులభంగా సమాధానాలు రాయవచ్చు.

ఒకే పుస్తకంలో అన్ని యూనిట్లకు సంబంధించిన అంశాలు పూర్తిగా ఉండవు. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ పుస్తకాలు చదవాలి.

పేపర్ - 3, సెక్షన్ - 3 (గవర్నెన్స్) :

ఈ సెక్ణన్ సిలబస్ కూడా విస్తృతంగా ఉంటుంది. కాబట్టి కొన్ని అంశాలను సెలెక్టెడ్ గా ప్రిపేర్ అవ్వడం కష్టంగా ఉంటుంది.

రెండు యూనిట్లకు సంబంధించిన అంశాలు పాలిటీకి లింక్ అయి ఉంటే, ఒక యూనిట్ మాత్రం ప్రభుత్వ పథకాలు, ఏజెన్సీకి సంబంధించిన అంశాలను సులువుగా అర్థం చేసుకోవచ్చు.

అయితే జాగ్రత్తగా పరిశీలించి చూస్తే కొన్ని అంశాలను ఎలిమినేషన్ పద్ధతిలో కూడా చూడవచ్చు.

పేపర్ - 4, సెక్షన్ - 1 (భారతదేశ ఎకానమీ):

భారతదేశ ఎకానమీ సిలబస్ లిమిటెడ్ గా ఉంటుంది.

కానీ ఎకానమీపై పూర్తిగా పట్టు ఉండక పోవడం వలన కఠినంగా కనిపించవచ్చు.

వ్యాసరూప ప్రశ్నల్లో, కొన్నింటికి సంఖ్య కూడా గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది.

కాబట్టి సంఖ్యలను కోట్ చేసేటప్పుడు కచ్చితంగా గుర్తు ఉంటేనే రాయాలి లేకపోతే రాయకపోవడం మంచిది.

రెండు యూనిట్లు సులభంగా ఉంటే, మూడు యూనిట్లు మాత్రం కఠినంగా ఉన్నాయి.

ఒక యూనిట్ లో మాత్రం సిలబస్ చాలా విస్తృతంగా ఉంది.

========

పేపర్ - 4, సెక్షన్ - 2 (తెలంగాణ ఎకానమీ):

సమకాలీన అంశాలతో.. గత 8 ఏళ్ల కాలంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంశాలు.. రెండు యూనిట్ల ఉంటే... 1956 నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు ఉన్న అంశాల మీద మూడు యూనిట్లు ఉన్నాయి.

రెండు యూనిట్లకు సంబంధించిన అంశాలు పూర్తిగా సంఖ్యలతో కూడినవి. అయితే, మరో రెండు యూనిట్లు డేటాతో ఆధారపడి ఉన్నాయి.

ఒక యూనిట్ అయితే పూర్తిగా భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.

పేపర్ - 4, సెక్షన్ -3 (అభివృద్ధి, పర్యావరణ సమస్యలు):

పూర్తిగా సిద్దాంతాలతో కూడిన యూనిట్లు మూడు అయితే, చట్టాలకు సంబంధించిన అంశాలు ఒక యూనిట్‌లో ఉన్నాయి.

ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పర్యావరణం

పర్యావరణం సబ్జెక్ట్ సులువుగా ఉన్నా ప్రశ్నలు మాత్రం వందకు పైగా తయారు చేసే వీలుంది.

ఏది ఏమైనా సమాధానం చాలా ముఖ్యమైనది. సమాధానం సరిగ్గా రాస్తే కాని అందరికంటే ఒకటి లేదా రెండు మార్కులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది.

పేపర్ - 5, సెక్షన్ - 1 (సైన్స్ అండ్ టెక్నాలజీ):

సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ లో దాదాపు 90 శాతం సమకాలీన అంశాలు ఉంటాయి. సమకాలీన అంశాల మీద మంచి పట్టు సాధించాలి.

రెండు యూనిట్లు మాత్రం భారతదేశ అంతరిక్ష పరిశోధన కు సంబంధించి ఉంటుంది.

ఒక యూనిట్ పూర్తి శక్తి వనరులకు సంబంధించిన అంశాలే ఉన్నాయి.

పేపర్ - 5, సెక్షన్ - 2 (సైన్స్):

సైన్స్ లో ఆధునిక ట్రెండ్ ఏ విధంగా ఉందనే అంశంపైనే ఈ సెక్షన్ ఆధారపడి ఉంది.

వ్యాక్సిన్ ల తయారీ పైనే పూర్తిగా ఒక యూనిట్ ఇచ్చారు.

భారతదేశంలో ఆధునిక సైన్స్ కి సంబంధించి ఒక యూనిట్ అయితే, బయోటెక్నాలజీ సంబంధించి రెండు యూనిట్లు ఉన్నాయి.

అంటువ్యాధుల సంక్రమణలకు సంబంధించిన ఒక యూనిట్ పూర్తిగా ఇవ్వడం జరిగింది.

డేటా ఇంటర్‌ప్రిటేషన్ పేపర్ -5, సెక్షన్ - 3:

పూర్తిగా ప్రాక్టీస్ తో కూడుకున్న సెక్షన్ ఇది. రోజుకు కనీసం ఒక గంట అయిన ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు వస్తాయి.

ఒక యూనిట్ అయితే పూర్తిగా డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ పై ఆధారపడి ఉంది. కాబట్టి అందరికి సమానంగానే ఉంటుంది.

డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కి సంబంధించి రెండు యూనిట్లు ఉన్నాయి.

పేపర్ - 6, సెక్షన్ - 1 (తెలంగాణ ఆలోచన 1948- 1970) :

ఈ సెక్షన్ పూర్తిగా థియరీ తో కూడుకుని ఉంది. దీనిలో ఒక యూనిట్ మాత్రం పూర్తిగా తెలంగాణ చారిత్రక నేపథ్యం, ముల్కీల గురించి ఇచ్చారు.

ముల్కీల నుండి 1969 వరకు ముఖ్య సంఘటనల గురించి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది.

మార్కెట్లో దొరుకుతున్న పుస్తకాల కంటే సంపూర్ణమైన అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

పేపర్ -6, సెక్షన్ -2 (సమీకరణ దశ 1971-1990):

రెండు యూనిట్లకు సంబంధించిన సమాచారం పూర్తిగా దొరుకుతుంది. కాబట్టి ఈ అంశంలో పూర్తిగా పట్టు సాధించాలి.

సమీకరణ దశలో వ్యవసాయ క్లిష్ట పరిస్థితులు , చేతి వృత్తులు పై పూర్తి అవగాహన చేసుకోవాలి.

పేపర్ -6 , సెక్షన్ - 3 (తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశ, 1991 - 2014 )

90వ దశకంలో తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసిన సంస్థలను పూర్తిగా చదువుకోవాలి.

తెలంగాణ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు, అవి ఇచ్చిన రిపోర్టులు పూర్తిగా చదవాలి.

వివిధ ఉద్యోగ సంఘాలు, పౌరసమాజం, కవులు, కళాకారులు, విద్యార్థులు, రచయితలు పోషించిన పాత్రలు చాలా ముఖ్యమైనవి.

సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సహాయ నిరాకరణ ఉద్యమాలు చాలా ముఖ్యం.

- పృథ్వీ కుమార్ చౌహాన్, డైరెక్టర్ ప్రుథ్వీస్ ఐఏఎస్ అకాడమీ..

READ MORE

కరెంట్ అఫైర్స్: అవార్డులు



Next Story

Most Viewed