నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

by Naveena |

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యాయి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కులు, సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉంటే చాలు జాబ్‌ మీదే. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, 2025-26 సంవత్సరానికి నాగ్‌పుర్‌ డివిజన్, మోతిబాగ్‌ వర్క్‌షాప్‌(నాగ్‌పుర్‌)లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే దరఖాస్తులు చేసుకోవాలి. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మొత్తం అప్రెంటీస్ పోస్టుల 1007 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పీఓపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్ తదితర ట్రేడుల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.పోస్టులు – వెకెన్సీలు

ఫిట్టర్: 66 పోస్టులు

కార్పెంటర్: 39 పోస్టులు

వెల్డర్: 17 పోస్టులు

సీవోపీఏ: 170 పోస్టులు

ఎలక్ట్రీషియన్: 253 పోస్టులు

స్టెనోగ్రాఫర్/ సెక్రెటీరియల్ అసిస్టెంట్: 20 పోస్టులు

ప్లంబర్: 36 పోస్టులు

పెయింటర్: 52 పోస్టులు

వైర్ మెన్: 42 పోస్టులు

ఎలక్ట్రానిక్ మెకానిక్: 12 పోస్టులు

డీజిల్ మెకానిక్: 110 పోస్టులు

మెకానిస్ట్: 5 పోస్టులు

టర్నర్: 7 పోస్టులు

డెంటల్ లేబోరెటరీ టెక్నీషియన్: 1 పోస్టు

హాస్పిటల్ వేస్ట్ మేనేజ్ మెంట్ టెక్నీషియన్: 1పోస్టు

హెల్త్ సెనిటరీ ఇన్ స్పెక్టర్: 1 పోస్టు

స్టెనోగ్రాఫర్: 12 పోస్టులు

కేబుల్ జాయింటర్: 21 పోస్టులు

డిజటర్ ఫోటోగ్రాఫర్: 03 పోస్టులు

డ్రైవర్- కమ్ – మెకానిక్: 3 పోస్టులు

మెకానిక్ టూల్ మెయింటెనెన్స్: 12 పోస్టులు

మేజన్ (బిల్డింగ్ కన్ స్ట్రక్టర్): 36 పోస్టులు

మోతీభాగ్ వర్క్ షాప్ లో..

ఫిట్టర్: 44

వెల్డర్: 9

టర్నర్: 4

ఎలక్ట్రీషియన్: 18 పోస్టులు

సీవోపీఏ: 13 పోస్టులు

విద్యార్హత: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ క్లాస్, సంబంధిత ట్రేడ్ లలో ఐటీఐ పాసై ఉండాలి.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 5

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 4

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

స్టైఫండ్: అప్రెంటీస్ పోస్టుకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ అందజేస్తారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్:https://secr.indianrailways.gov.in/

Next Story