గురుకుల పాఠశాలల్లో 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు

by Disha Web Desk 17 |
గురుకుల పాఠశాలల్లో 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు
X

దిశ, కెరీర్: తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ - రిక్రూట్‌మెంట్ బోర్డు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 88

సొసైటీల వారీగా ఖాళీలు:

మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు - 60

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు - 24

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ - 4

అర్హతలు: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, టీసీసీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జులై 1, 2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. (నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా నిబంధనలు వర్తిస్తాయి)

వేతనం: నెలకు రూ. 31,040 నుంచి రూ. 92,050 ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, డెమాన్‌స్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 1200 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు రూ. 600).

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 24, 2023.

చివరి తేదీ: మే 24, 2023.

వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in

ఇవి కూడా చదవండి:

గురుకుల పాఠశాలల్లో 275 ఫిజికల్ డైరెక్టర్ ఖాళీలు.. చివరి తేదీ ఎప్పుడంటే..?

Next Story

Most Viewed