TSSPDCLలో 48 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు

by Disha Web Desk 17 |
TSSPDCLలో 48 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు
X

దిశ, కెరీర్: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 48 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 48

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 64,295 నుంచి రూ. 99,345.

ఎంపిక: రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష కేంద్రాలు: జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: మార్చి 15, 2023.

పరీక్ష తేదీ: ఏప్రిల్ 30, 2023.

వెబ్‌సైట్: https://www.tssouthernpower.com


Next Story