- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెజాన్ కీలక నిర్ణయం.. ఆ దేశస్తుల ఉద్యోగ దరఖాస్తులు బ్లాక్
ఉద్యోగ నియామకాల విషయంలో అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగ నియామకాల విషయంలో అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఓ దేశానికి చెందిన ఉద్యోగార్థులపై ప్రభావం చూపనుంది. నియంత కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని నార్త్ కొరియా పౌరులను తమ కంపెనీలో ఉద్యోగ నియామకాల్లో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ప్రజల నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన అప్లికేషన్లను అమెజాన్ బ్లాక్ చేసినట్లు.. సంస్థ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ స్టీఫెన్ స్మిత్.. లింక్డిన్ పోస్టు ద్వారా వెల్లడించారు. వారికి ఉద్యోగాలు ఇస్తే ఆర్థిక దోపిడీ, డేటా ఉల్లంఘన జరుగుతుందని అమెజాన్ ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికా సహా ప్రపంచ దేశాల్లోని రిమోట్ బేస్డ్ ఐటీ జాబ్స్ పొందేందుకు నార్త్ కొరియా వాసులు ప్రయత్నిస్తున్నారని స్టీఫెన్ తెలిపారు. ఏడాదికాలంలో నార్త్ కొరియా నుంచి వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 30 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఉద్యోగులు ల్యాప్ టాప్ ఫార్మ్స్.. అంటే కంప్యూటర్లు అమెరికాలో ఉన్నట్లు చూపించి.. వాటిని విదేశాల నుంచి ఆపరేట్ చేయడంపై ఆధారపడతారని వివరించారు. ఇటీవల ఆరిజోనాలో ఉత్తర కొరియా ఐటీ ఉద్యోగులకు ల్యాప్ టాప్ ఫార్మ్స్ నిర్వహిస్తూ సహకరించిన మహిళకు 8 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఈ వ్యవహారంలో ఆపరేటర్, ఉత్తర కొరియా ప్రభుత్వానికి 17 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు.






