కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలు

by Disha Web Desk 17 |
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలు
X

దిశ, కెరీర్: ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో అర్హులైన బాలికలకు ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 352 కేజీబీవీ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌తో 7,8,9 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన బాలికలు ఏప్రిల్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశాల వివరాలు:

ఏపీ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6 వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలతో పాటు 7,8,9 వ తరగతులలో మిగులు సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత: అనాథలు, బడి బయట ఉన్న పిల్లలు, స్కూల్ మధ్యలో మానేసిన డ్రాపౌట్స్, పేద, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2023.

సర్టిఫికెట్ వెరిఫికేషన్: ఏప్రిల్ 26, 2023 నుంచి ఏప్రిల్ 30, 2023.

వెబ్‌సైట్: https://apkgbv.apcfss.in



Next Story

Most Viewed