ఉద్యోగాల ఖాళీలను ఒకేసారి భర్తీ చేయాలి

by  |
ఉద్యోగాల ఖాళీలను ఒకేసారి భర్తీ చేయాలి
X

దిశ, కరీంనగర్ సిటి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ ఒకేసారి భర్తీ చేయాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక తెలంగాణ చౌక్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిసి కూడా, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల నేడు నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఉన్న పట్టింపు యువతకు ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఎందుకులేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎలక్షన్ కోడ్లతో కాలయాపన చేసుకుంటూ ఉద్యోగాల భర్తీ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ప్రైవేటు టీచర్లు ఉద్యోగాలు కోల్పోయి ఆత్మ బలిదానాలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు ఎక్కడుందని అన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి చెల్లించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి. నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు లక్పతి నాయక్, తదితరులు పాల్గొన్నారు.



Next Story