వరంగల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 1.25 లక్షల వేతనం..!

452
Job notification

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వ‌రంగ‌ల్ అర్బన్ జిల్లాలో.. వైద్యశాఖ 2022 మార్చి 31వ‌ర‌కు కాంట్రాక్టు ప‌ద్ధతిలో ప‌నిచేసేందుకు నియామ‌కాలు చేప‌డుతున్నట్లు డీఎంహెచ్‌వో ల‌లితాకుమారి తెలిపారు. సోమ‌వారం డీఎంహెచ్‌వో ఓ ప‌త్రిక ప్రకట‌న‌ను విడుద‌ల చేశారు. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, సివిల్ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల నియామ‌కాలు జ‌న‌ర‌ల్ మెడిసిన్ విభాగంలో 10, పీడియాట్రిక్స్ విభాగంలో 9, ప‌ల్మోన‌రి మెడిస‌న్ విభాగంలో 4, అన‌స్తీషియాల‌జీ 12, రేడియాల‌జీ 8, పాతాల‌జీ 6, మైక్రోబ‌యాల‌జీ4, బ‌యో కెమెస్ట్రీ 4, ఫోరెన్సిక్ మెడిస‌న్ 4, అబ్ట్రిక్స్ మ‌రియు గైన‌కాల‌జీ 12, ఈఎన్‌టీ 4, డెంట‌ల్ 1, ఆప్తమాల‌జిస్ట్ 4, ఎండో కైనాల‌జిస్ట్‌1, జ‌న‌ర‌ల్ స‌ర్జరీ 4, రేడియో థెర‌పీ 2 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అలాగే నాలుగు అసిస్టెంట్ స‌ర్జన్ల పోస్టులను భర్తీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లకు నెల‌కు 1.25ల‌క్షల జీతం చెల్లించ‌డం జ‌రుగుతుంద‌ని, అసిస్టెంట్ స‌ర్జన్లకు నెల‌కు రూ.40వేల జీతం ఉంటుంద‌ని పేర్కొన్నారు. అభ్యర్థులు ​వ‌రంగ‌ల్ అర్బన్ జిల్లా ప‌రిధిలోని ప్రధాన ఆస్పత్రుల్లో ప‌నిచేయ‌వ‌ల‌సి ఉంటుంద‌ని డీఎంహెచ్‌వో తెలిపారు. ఆస‌క్తిగ‌ల వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని, ఈనెల 29న ఉద‌యం 11గంట‌ల నుంచి సాయంత్రం 5గంట‌ల్లోపు కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల‌లో జ‌రిగే ఇంట‌ర్వ్యూకు హాజ‌రుకావాల‌ని తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..