- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉచిత ఆన్‌లైన్ జాబ్ మేళా
<p>దిశ ప్రతినిధి ,హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ ,యువకులకు యూనివర్శిటీ ఎంప్లాయ్ మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ,మోడల్ కెరియర్ సెంటర్ , ఉస్మానియా యూనివర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఆన్ లైన్ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు యూనివర్శిటీ ఎంప్లాయ్ మెంట్ ఇన్ఫర్మేషన్ చీఫ్ అధికారి టి రాము మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా ఎన్సీఎస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. […]</p>

దిశ ప్రతినిధి ,హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ ,యువకులకు యూనివర్శిటీ ఎంప్లాయ్ మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ,మోడల్ కెరియర్ సెంటర్ , ఉస్మానియా యూనివర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఆన్ లైన్ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు యూనివర్శిటీ ఎంప్లాయ్ మెంట్ ఇన్ఫర్మేషన్ చీఫ్ అధికారి టి రాము మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆన్‌లైన్ జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా ఎన్సీఎస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. WWW.NCS.GOV.IN వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకునే అభ్యర్థులకు వివిధ కంపెనీలకు చెందిన యాజమాన్యాలు ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వివరించారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు బుధవారం తమపేర్లను పైన సూచించిన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని అన్నారు. ఇతర వివరాలకు టి. రఘుపతి 8247656356 నెంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.






