2022లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం.. జిందాల్ స్టీల్ కీలక ప్రకటన

by  |

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశానికి చెందిన ప్రముఖ సంస్థ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ 2022లో బోట్స్ వానాలోని ఆగ్నేయ మ్మమాబులా బొగ్గు క్షేత్రాలలో బొగ్గు గనిని నిర్మించడం ప్రారంభిస్తుందని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి చేసిన బొగ్గును ప్రణాళికాబద్దంగా విద్యుత్ ప్లాంట్ కు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే సంవత్సరం నుంచి పనులు ప్రారంభమవుతాయని, సంవత్సరానికి 4.5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని, దక్షిణాఫ్రికా మార్కెట్ లో బొగ్గు కొరతను తీరుస్తామని జిందాల్ బోట్స్వానా కంట్రీ హెడ్ నీరజ్ సక్సేనా అన్నారు. ఈ నెల COP26 క్లైమేట్ కాన్ఫరెన్స్ లో బోట్స్ వానా బొగ్గు వినియోగాన్ని తగ్గించడానికి సంతకం చేసింది. కాని ఇటీవల మళ్ళీ కొత్త బొగ్గు మైనింగ్ లైసెన్స్ లను పునరుద్దరించింది. బొట్స్వానా తన విద్యుత్తులో పునరుత్పాదక శక్తి వాటాను రాబోయే 20 సంవత్సరాలలో 2 శాతం నుండి 18 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story