- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాణా కుంభకోణం కేసులో లాలుకు ఊరట
by Shamantha N |
<p>పాట్నా: బీహార్ దాణా కుంభకోణానికి సంబంధించిన కేసులో రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు లాలు ప్రసాద్ యాదవ్‌కు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి దుమ్కా ట్రెజరీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తు జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ట్రెజరీ నుంచి రూ. 3.13 కోట్లు విత్ డ్రా చేశారని ఆయనపై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. […]</p>

X
పాట్నా: బీహార్ దాణా కుంభకోణానికి సంబంధించిన కేసులో రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు లాలు ప్రసాద్ యాదవ్‌కు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి దుమ్కా ట్రెజరీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తు జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ట్రెజరీ నుంచి రూ. 3.13 కోట్లు విత్ డ్రా చేశారని ఆయనపై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బీహార్ దాణా కుంభకోణానికి సంబంధించి ఆయనపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. వాటిలో మూడు కేసులకు సంబంధించి ఆయనకు గతంలో బెయిల్ మంజూరు అయింది. తాజాగా మిగిలిన ఒక్క కేసు దుమ్కా ట్రెజరీలో కూడా ఆయనకు బెయిల్ దొరికింది.
Next Story






