- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు : ఝాన్సీ
<p>సీరియల్ నటులు చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ‘ఆమె కథ’ సీరియల్ హీరో హీరోయిన్లతో పాటు పలువురు నటులకు కరోనా సోకగా దాదాపు అన్ని సీరియళ్లు షూటింగ్ వాయిదా పడింది. ఈ క్రమంలోనే ప్రముఖ నటి, యాంకర్ ఝాన్సీ కూడా కరోనా బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై క్లారిటీనిచ్చింది ఝాన్సీ. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను సెండ్ చేసింది. View this post on Instagram clearing […]</p>

సీరియల్ నటులు చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ‘ఆమె కథ’ సీరియల్ హీరో హీరోయిన్లతో పాటు పలువురు నటులకు కరోనా సోకగా దాదాపు అన్ని సీరియళ్లు షూటింగ్ వాయిదా పడింది. ఈ క్రమంలోనే ప్రముఖ నటి, యాంకర్ ఝాన్సీ కూడా కరోనా బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై క్లారిటీనిచ్చింది ఝాన్సీ. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను సెండ్ చేసింది.
ప్రస్తుతానికి పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపిన ఝాన్సీ.. తనకు కరోనా రాలేదని స్పష్టం చేసింది. తాను షూటింగ్‌లో పాల్గొన్న సెట్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపింది. ఇప్పటికే వారం రోజులు అయిందని.. మరో వారం రోజులు ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. కరోనా వచ్చిందో రాలేదో అనే సందిగ్ధంలో బయటకు వెళ్లి.. ఇతరులకు కరోనా వ్యాప్తి చేసే బదులు ఇంట్లోనే చక్కగా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఊహాగానాలతో అనవసరమైన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా వ్యవహరించాలని ఈ వీడియోలో మీడియాను కోరింది.






