విడుదలైన జవాన్… ఎక్స్‌క్లూజివ్ వీడియో

234

దిశ, భద్రాచలం : గత ఆరు రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ గురువారం సాయంత్రం క్షేమంగా విడుదలైనారు.‌ ఈనెల 3న ఎన్‌కౌంటర్ సమయంలో మావోయిస్టులకు చిక్కిన్ జవాన్‌ని వారు తమ వెంట బందీగా తీసుకెళ్ళారు. అతడికి ఏ హాని తలపెట్టకుండా క్షేమంగా విడిచి పెట్టాలని కుటుంబ సభ్యులు, పలు సంఘాలు విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తుల ద్వారా జవాన్‌ని విడుదల చేస్తామని మావోయిస్టులు సైతం ప్రకటించడంతో మధ్యవర్తిత్వం కోసం ఇద్దరు సభ్యుల బృందాన్ని సీజీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పద్మశ్రీ ధరంపాల్ సైని, గోండ్వానా సమాజ్ ప్రసిడెంట్ తెల్లం బోరియాతో సహా ప్రభుత్వం తరపున ఇద్దరు సభ్యులు, ఏడుగురు పాత్రికేయులు కలిసి మొత్తం 11 మంది ఈరోజు బస్తర్ అడవికి చేరుకున్నారు. వందలాది గ్రామస్థుల సమక్షంలో జవాన్‌ని మావోయిస్టులు ఆ బృందానికి అప్పగించినట్లు సమాచారం. మావోయిస్టుల చెర నుంచి జవాన్ విడుదల కావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కాగా జవాన్ విడుదలకి సంబంధిన వీడియో, ఫోటోలు కింద ఉన్నాయి చూడవచ్చు.

 

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..