ఒలింపిక్స్ వాయిదా వేయం : జపాన్ ప్రధాని

by  |
ఒలింపిక్స్ వాయిదా వేయం : జపాన్ ప్రధాని
X

కరోనా దెబ్బకు క్రీడా టోర్నీలన్నీ పెద్ద ఎత్తున రద్దవుతున్న క్రమంలో జులై 24 నుంచి ప్రారంభం కావల్సిన ఒలంపిక్స్‌పైనా నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రపంచ దేశాల నుంచి వందలాది మంది క్రీడాకారులు, సహాయక సిబ్బంది రానున్న నేపథ్యంలో వారందరి ఆరోగ్యానికి భరోసా ఎలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల నడుమ టోక్యో ఒలంపిక్స్‌ను వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే.

కానీ, తాజాగా జపాన్ ప్రధాని షింజో అబె చేసిన ప్రకటన ఒలింపిక్స్ నిర్వహణపై అందరి అనుమానాలను పటాపంచలు చేసింది. టోక్యో ఒలంపిక్స్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని శనివారం ‘షింబో అబె’ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ (ఐవో‌సీ), ఒలంపిక్స్ నిర్వహణ కమిటీలతో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఒలంపిక్స్‌పై కరోనా మహమ్మారి ప్రభావం ఉండదని అబె తెలియజేశారు. ఈ మెగా ఈవెంట్ విజయవంతం కావడానికి అమెరికా తమకు సహాయం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: Olympics, Japan PM , Tokyo, Olympic committee, corona, Triumph


Next Story

Most Viewed