జాన్వీ కపూర్ మిడిల్ క్లాస్ వేషాలు

54

దిశ, వెబ్‌డెస్క్ : కోలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘కొలమావు కోకిల’ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ్‌లో సూపర్ సక్సెస్ అందుకోగా.. ‘గుడ్ లక్ జెర్రీ’ టైటిల్‌తో కలర్ ఎల్లో ప్రొడక్షన్ బ్యానర్‌పై బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఆనంద్ ఎల్ రాయ్. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభం అవుతుండగా.. జాన్వీకి వెల్ కమ్ చెప్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సింపుల్ పంజాబీ డ్రెస్‌లో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తున్న జాన్వీ లుక్‌కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. కాగా పంజాబ్‌లోని పటియాలలో షూటింగ్ స్టార్ట్ అయిన సినిమాకు సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకులు కాగా.. పంకజ్ మట్టా రచయిత. దీపక్ దోబ్రియాల్, సుశాంత్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.