కౌగిలింతలు, ముద్దుల్లో మునిగితేలిన స్టార్ హీరోయిన్ కూతుళ్లు

by  |
కౌగిలింతలు, ముద్దుల్లో మునిగితేలిన స్టార్ హీరోయిన్ కూతుళ్లు
X

దిశ, సినిమా : అందాల తార, లేట్ శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ అండ్ స్టైలిష్ సిస్టర్స్‌గా గుర్తింపు పొందారు. పార్టీలు, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించే కపూర్ సిస్టర్స్ రీసెంట్‌గా ఓ బర్త్‌డే పార్టీలో హల్ చల్ చేశారు. ఈ పార్టీకి జాన్వీ రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ అక్షత్ రజన్ కూడా హాజరు కాగా.. వీరిద్దరికి సంబంధించిన క్లోజ్ మూమెంట్ పిక్స్, బూమరాంగ్ వీడియోస్‌ను జాన్వీ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇద్దరు కలిసి ముద్దులు, కౌగిలింతల్లో మునిగితేలుతూ చిల్‌అవుట్ అవుతున్న ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇక కొన్ని రోజుల కిందట అక్షత్ బర్త్‌డే సందర్భంగా తన భుజంపై వాలిన ఫొటో పోస్ట్ చేస్తూ జాన్వీ విషెస్ చెప్పి సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారా? లేదా అనే విషయంలో క్లారిటీ లేకపోగా.. గతేడాది ఈ జంట లోనవాలా ట్రిప్‌కు వెళ్లిన ఫొటోస్, వీడియోస్ మాత్రం సోషల్ మీడియాలో కొన్నిరోజులు ట్రెండింగ్‌లో ఉన్నాయి.


Next Story