- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ వైఖరి వల్లే తేజస్విని ఆత్మహత్య : జనసేన
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థిని తేజస్విని ఆత్మహత్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫీజుల బకాయిల వల్ల పరీక్షలు రాయలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల ఫీజు రియింబర్స్‌మెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్లే తేజస్విని బలన్మరణానికి పాల్పడిందని ఆరోపించారు. విద్యకు పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశ్యంతోనే ఫీజు రీ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థిని తేజస్విని ఆత్మహత్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫీజుల బకాయిల వల్ల పరీక్షలు రాయలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల ఫీజు రియింబర్స్‌మెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్లే తేజస్విని బలన్మరణానికి పాల్పడిందని ఆరోపించారు. విద్యకు పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశ్యంతోనే ఫీజు రీ ఎంబర్మ్సెంట్ పథకం మొదలైందని గుర్తుచేశారు.
పేద విద్యార్థుల ప్రతీ ఫీజును త్రైమాసికంలో కడుతామని చెప్పిన ప్రభుత్వం తన హామీని నిలుపుకోవడంలో విఫలం అవుతోందని వెల్లడించారు. కొద్ది నెలల కిందట కూడా ఒంగోలులో క్విస్ విద్యా సంస్థ ఇదే రీతిలో వ్యవహరిస్తే జనసేన పేద విద్యార్థల పక్షాన నిలిచిందని గుర్తుచేశారు. మరోసారి అదే సమస్య తలెత్తడమ వల్లే తేజస్విని ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. ఫీజు రీ ఎంబర్మ్సెంట్ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి పేద విద్యార్థుల ఫీజుల బకాయిలన చెల్లించాలని తెలిపారు. తేజస్విని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ చేశారు.






