- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోశయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న జానారెడ్డి
by Shyam |
<p>దిశ, నాగార్జున సాగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల కాంగ్రెస్ మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహచర కేబినెట్ మంత్రిగా ఆయనతో చిరకాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పరిపాలనా అంశాల్లో రోశయ్యతో వివిధ కమిటీల్లో పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేశారు. పరస్పర అవగాహనతో, పలు చర్చల్లో ఆయన చూపిన ప్రతిభకు ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయని జానారెడ్డి […]</p>

X
దిశ, నాగార్జున సాగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల కాంగ్రెస్ మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహచర కేబినెట్ మంత్రిగా ఆయనతో చిరకాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పరిపాలనా అంశాల్లో రోశయ్యతో వివిధ కమిటీల్లో పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేశారు. పరస్పర అవగాహనతో, పలు చర్చల్లో ఆయన చూపిన ప్రతిభకు ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయని జానారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయనతో ఉన్న అనుబంధం, మరువలేనిదని అన్నారు. తమిళనాడు గవర్నర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ సీనియర్ నేతగా, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పని చేసిన రోశయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Next Story






