- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాప్ 10 లో జమ్మికుంట పోలీస్ స్టేషన్
<p>దిశ, క్రైమ్ బ్యూరో: దేశంలోనే అత్యుత్తమ పది పోలీసు స్టేషన్లలో ఒకటిగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన జమ్మికుంట పీఎస్ ఎంపికైంది. ఈ సందర్భంగా డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పౌర సేవల విభాగంలో అత్యుత్తమ సేవలంచడం, పోలీస్ స్టేషన్ల మధ్య స్నేహపూర్వక పోటీ తత్వాన్ని కల్పించేందుకు దేశవ్యాప్తంగా పది అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఎంపిక చేస్తుంది. 2020 సంవత్సరానికి గాను పది స్టేషన్లలో జమ్మికుంట పీఎస్ ఉన్నట్లు […]</p>

దిశ, క్రైమ్ బ్యూరో: దేశంలోనే అత్యుత్తమ పది పోలీసు స్టేషన్లలో ఒకటిగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన జమ్మికుంట పీఎస్ ఎంపికైంది. ఈ సందర్భంగా డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పౌర సేవల విభాగంలో అత్యుత్తమ సేవలంచడం, పోలీస్ స్టేషన్ల మధ్య స్నేహపూర్వక పోటీ తత్వాన్ని కల్పించేందుకు దేశవ్యాప్తంగా పది అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఎంపిక చేస్తుంది. 2020 సంవత్సరానికి గాను పది స్టేషన్లలో జమ్మికుంట పీఎస్ ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.
కాగా, వరుసగా రెండవసారి కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల కరీంనగర్ కమీషనర్ వి.బి. కమలహాసన్ రెడ్డి, జమ్మికుంట స్టేషన్ హౌస్ అధికారితో పాటు పోలీస్ అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. జమ్మికుంట పీఎస్‌కు దక్కిన ఈ పురస్కారం స్పూర్తిగా రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లు కూడా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తమ పౌర సేవలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుకు ఆదర్శంగా తీసుకోవాలని సూచంచారు. 2019 సంవత్సరంలో చొప్పదండి పోలీస్ స్టేషన్ 7వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా నిలిచింది.






