Aus Vs Eng : యాషెస్ సిరీస్ ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్

by  |
Aus Vs Eng : యాషెస్ సిరీస్ ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్రిస్బేన్ వేదికగా బుధవారం(డిసెంబర్ 8) నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ​ప్రారంభం కానుంది. ఈ క్రమంలో యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్, సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఫస్ట్ టెస్టుకు దూరం కానున్నాడు. పిక్క కండరాల గాయంతో అతను బ్రిస్బేన్ టెస్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. ఇతడి స్థానంలో మరో పేసర్ క్రిస్ వోక్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు వికెట్ కీపర్ జాస్ బట్లర్ మాట్లాడుతూ.. అండర్సన్​ఫిట్‌గా ఉన్నాడని తెలిపాడు. సుదీర్ఘ సిరీస్ దృష్ట్యా తొలి టెస్టుకు విశ్రాంతి ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. అంతకు ముందు 2019లో జరిగిన యాషెస్​లోనూ ఇదే గాయంతో అండర్సన్ పూర్తి టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.



Next Story