కూల్చిన చోటే మసీదులను మళ్లీ నిర్మించాలి

by Shyam |

<p>దిశ, న్యూస్‌బ్యూరో: సెక్రటరియేట్ ఆవరణలో కూల్చివేసిన రెండు మసీదులు మస్జిద్ హాష్మీ, మస్జిద్ దఫాతిరెను నిర్దిష్ట కాల వ్యవధిలో మళ్ళీ నిర్మించాలని, తక్షణం ప్రభుత్వం ప్రకటన చేయాలని జమాతె ఇస్లామీ హింద్ తెలంగాణ అధ్యక్షులు మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. సీఎం కేసీఆర్ మౌనం వీడాలని అన్నారు. కూల్చివేతను ముఖ్యమంత్రి యాధృచ్ఛికంగా జరిగిన సంఘటనగా పేర్కొంటూ ఘటన సీరియస్ నెస్ తగ్గించి చూపే రాజకీయ ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయమై ఆయన [&hellip;]</p>

దిశ, న్యూస్‌బ్యూరో: సెక్రటరియేట్ ఆవరణలో కూల్చివేసిన రెండు మసీదులు మస్జిద్ హాష్మీ, మస్జిద్ దఫాతిరెను నిర్దిష్ట కాల వ్యవధిలో మళ్ళీ నిర్మించాలని, తక్షణం ప్రభుత్వం ప్రకటన చేయాలని జమాతె ఇస్లామీ హింద్ తెలంగాణ అధ్యక్షులు మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. సీఎం కేసీఆర్ మౌనం వీడాలని అన్నారు. కూల్చివేతను ముఖ్యమంత్రి యాధృచ్ఛికంగా జరిగిన సంఘటనగా పేర్కొంటూ ఘటన సీరియస్ నెస్ తగ్గించి చూపే రాజకీయ ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయమై ఆయన నోటిమాటగా విచారం వ్యక్తం చేయడం, అక్కడే మళ్ళీ కడతామని చెప్పడం కేవలం రాజకీయ వ్యాఖ్యలే తప్ప మరేమీ కావని, ముస్లిములకు ఈ నోటిమాట ఊరడింపులు అవసరం లేదన్నారు. కొత్త సెక్రటరీయేట్ డిజైనులో ఈ మసీదులు, మందిరం లేవన్నారు. ముస్లిం సంస్థలు, ధర్మవేత్తలు అందరు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దడానికి స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు.

Next Story