తమిళ్ మూవీ రీమేక్‌లో ‘జాన్వి’

by  |
తమిళ్ మూవీ రీమేక్‌లో ‘జాన్వి’
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఇండస్ట్రీ హిందీ చిత్ర సీమను అట్రాక్ట్ చేస్తోంది. ఇక్కడ రూపొందిన సినిమాల రీమేక్‌లపై ఇంట్రెస్ట్‌ను పెంచుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల తెలుగు, తమిళ చిత్రాలు బాలీవుడ్‌లో ఎక్కువగా రీమేక్ అవుతుండగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళ్ మూవీ ‘కోలమావు కోకిల(కోకిల కోకిల)’ కూడా రీమేక్‌కు సిద్ధమైంది.

ఇప్పటికే ప్రముఖ నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనుగోలు చేయగా.. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారు. నయన్ పాత్రలో జాన్వీ కపూర్ కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది.


Next Story