ఆ విషయంలో నేను లక్కీ : జాన్వీ

by  |
ఆ విషయంలో నేను లక్కీ : జాన్వీ
X

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ త్వరలో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతుంది. తొలి సినిమా ధడక్‌లో తన నటనతో తల్లికి తగ్గ కూతురవుతుందని అనిపించుకున్న జాన్వీ.. ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయింది. ఆగస్ట్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. విశేషమైన నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. ఇతర మహిళలు, యువతులను చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుందని.. వారు సమాజంలో ఫేస్‌ చేస్తున్నటువంటి పరిస్థితులతో తాను డీల్ చేయలేనని తెలిపింది.

ఇక సినిమా విషయానికొస్తే ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు గర్వంగా ఉందని తెలిపింది. అయితే గుంజన్ జీవితం గురించి తెలుసుకున్నప్పుడు.. గుంజన్ తన గురించి తానెప్పుడూ హీరోగా ఫీల్ అవ్వలేదని, కేవలం తన పని తాను చేసుకుంటూ పోయిందని తెలిపింది జాన్వీ. సినిమాల్లో ఫిమేల్ యాక్టర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆలోచించేదాన్నని.. దర్శక, నిర్మాతలు వారి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారని అనిపించేదని తెలిపింది. కానీ పరిస్థితులు ఇలా ఉన్నాయని అందులో తప్పేమీ లేదని రియలైజ్ అయినట్లు చెప్పింది జాన్వీ.


Next Story

Most Viewed