- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌లో విషాదం.. కీలక నేత మృతి
<p>దిశ, జగిత్యాల: అనారోగ్యం కారణంతో జగిత్యాల అర్బన్ ఎంపీపీ మ్యాదరి వనిత (42) గురువారం హఠాన్మరణం చెందారు. కొద్ది రోజుల నుండి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. ధరూర్ ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన వనిత జగిత్యాల అర్బన్ మండల ఎంపీపీగా కొనసాగుతున్నారు. వనితకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వనిత భర్త మ్యాదరి అశోక్ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఎంపీపీ హఠాన్మరణం పట్ల ధరూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజకీయంగా […]</p>

దిశ, జగిత్యాల: అనారోగ్యం కారణంతో జగిత్యాల అర్బన్ ఎంపీపీ మ్యాదరి వనిత (42) గురువారం హఠాన్మరణం చెందారు. కొద్ది రోజుల నుండి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. ధరూర్ ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన వనిత జగిత్యాల అర్బన్ మండల ఎంపీపీగా కొనసాగుతున్నారు. వనితకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వనిత భర్త మ్యాదరి అశోక్ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఎంపీపీ హఠాన్మరణం పట్ల ధరూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న వనిత ఆకస్మిక మరణం పట్ల పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జగిత్యాల అర్బన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీ మ్యాదరి వనిత మృతికి పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాని, వారి కుటుంబ సభ్యులకు జీవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.






