బన్నీ@20లో జగపతిబాబు విలనిజం

by  |
బన్నీ@20లో జగపతిబాబు విలనిజం
X

దిశ, వెబ్‌డెస్క్: అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత సినిమా సుకుమార్ డైరెక్షన్‌లో ఉండబోతోంది. అల్లు అర్జున్‌కు ఇది 20వ సినిమా కాగా…. బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. హీరోయిన్‌గా రష్మిక మందన్నా ఎంపిక కాగా… గిరిజన అమ్మాయి పాత్రలో ఆకట్టుకోనుంది. ఉప్పెన సినిమాతో ఫుల్ లెంత్ తెలుగు చిత్రాన్ని చేస్తున్న విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారట. ఫారెస్ట్ ఇన్స్‌పెక్టర్‌గా విజయ్ తన మార్క్ చూపించనున్నాడని సమాచారం. కాగా… సెకండ్ ఇన్నింగ్స్‌తో దుమ్ముదులిపేస్తున్న జగపతిబాబు, కన్నడ యాక్టర్ రాజ్ దీపక్ శెట్టిలను విలన్స్‌గా ఎన్నుకున్నారట సుకుమార్. ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్ రిపీట్ అవుతుండగా.. హ్యాట్రిక్ ఖాయమంటున్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్‌తో చేసిన హ్యాట్రిక్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ… సుకుమార్‌తో చేస్తున్న హ్యాట్రిక్ మూవీతోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ సినిమా కథను ముందుగా సూపర్ స్టార్ మహేష్‌కు వినిపించాడు సుకుమార్. కానీ ప్రిన్స్ ఈ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్‌ను ఎంచుకున్నాడు సుక్కు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Next Story

Most Viewed