జగ్గూ భాయ్.. న్యూ సిరీస్

by  |
జగ్గూ భాయ్.. న్యూ సిరీస్
X

టాలీవుడ్‌ ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. కానీ కొత్త జనరేషన్ ఎంటర్ అయ్యాక ఒకానొక దశలో అవకాశాల్లేక ఇబ్బంది పడ్డట్టు స్వయంగా ఆయనే వెల్లడించాడు. అయితే, లెజెండ్ సినిమాతో విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాకే జగ్గూ భాయ్ అసలు స్టామినా ఏంటో జనాలకు తెలిసింది. ఈ చిత్రం తర్వాతే విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సౌత్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు జగ్గు. లెజెండ్ తర్వాత వచ్చిన ‘రంగస్థలం, అరవింద సమేత’ చిత్రాల్లో తన నటన ఫిదా కానివారుండరంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే, 2018లో ‘గ్యాంగ్‌స్టర్స్’ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి కూడా అడుగుపెట్టిన జగ్గూ భాయ్.. ఇప్పుడు మరో సిరీస్ కోసం రెడీ అవుతున్నారు.

బాహుబలి సినిమా నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు జగపతి బాబు. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సిరీస్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అప్పుడే సిరీస్ కోసం పని చేయబోయే నటీనటులు, టెక్నీషియన్స్ గురించి తెలపనున్నారు. మరోపక్క జగ్గూ భాయ్.. ఇటు తెలుగుతో పాటు తమిళ్‌లోనూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Next Story

Most Viewed