త్వరలో బాలీవుడ్‌లోకి జగపతిబాబు

by  |
Jagapathi-Babu-12
X

దిశ, సినిమా: ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో జగపతిబాబు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో డిఫరెంట్ షేడ్స్ చూపిస్తున్నాడు. మొదట్లో హీరోగా కేవలం పాజిటివ్ క్యారెక్టర్స్‌కు మాత్రమే పరిమితమైన జగ్గు భాయ్.. ఇప్పుడు నెగెటివ్ క్యారెక్టర్స్ క్రూయాలిటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్స్‌తో సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న ఆయనకు తాజాగా బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న సినిమాలో మెయిన్ విలన్‌గా సెలెక్ట్ అయినట్లు సమాచారం. ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు 15 ఏళ్ల తర్వాత జావేద్ అక్తర్ స్టోరీ-స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. కాగా, ఫర్హాన్ ఈ సినిమాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా కనిపించబోతుండగా.. రకుల్ ప్రీత్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేయబోతోంది. అశుతోష్ గోవరికర్ దర్శకత్వం వహించనున్న సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోగా.. డిసెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ సినిమాకు ‘పుకార్’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed