- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ కొత్త పథకం.. ‘సెలవు దినాల్లో విధ్వంసం’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వం రోజురోజుకీ పెరిగిపోతోందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రశ్నిస్తే వేధింపులు, అక్రమాలను అడ్డుకుంటే విధ్వంసాలా? అని ప్రశ్నించారు. విశాఖలోని మాజీ ఎమ్మెల్యే పల్లా ఆస్తులపై దాడులను ఆయన ఖండించారు. పల్లా ఆస్తులపై దాడులు బలహీనవర్గాలపై దాడులేనని అభిప్రాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో భూముల అమ్మకాలను ప్రశ్నించినా, వైసీపీ అక్రమాలను అడ్డుకున్నా దాడులు చేస్తారా? అని […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వం రోజురోజుకీ పెరిగిపోతోందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రశ్నిస్తే వేధింపులు, అక్రమాలను అడ్డుకుంటే విధ్వంసాలా? అని ప్రశ్నించారు. విశాఖలోని మాజీ ఎమ్మెల్యే పల్లా ఆస్తులపై దాడులను ఆయన ఖండించారు. పల్లా ఆస్తులపై దాడులు బలహీనవర్గాలపై దాడులేనని అభిప్రాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలో భూముల అమ్మకాలను ప్రశ్నించినా, వైసీపీ అక్రమాలను అడ్డుకున్నా దాడులు చేస్తారా? అని నిలదీశారు. సెలవు దినాల్లో విధ్వంసం అనే కొత్త పథకానికి జగన్ శ్రీకారం చుట్టారని విమర్శించారు. సీఎం జగన్‌కు సంపద సృష్టించడం చేతకాదన్నారు. కానీ సృష్టించిన వాటిని ధ్వంసం చేయడం మాత్రం తెలుసునంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
Next Story






