బిగ్ బ్రేకింగ్: ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టులో భారీ ఊరట

361
CM Jagan, YSR Ghat

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ కు సీబీఐ కోర్టులో భారీ ఊరట లభించింది. జగన్ అభిమానులు సంబురపడే తీర్పు వెలువడింది. గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీకి, అధినేతకు కొరకరాని కొయ్యగా మారారనడంలో అతిశయోక్తి లేదు. అదే పార్టీలో ఉంటూ కొద్దిరోజులుగా వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కొద్దిరోజులుగా కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. రఘురామకృష్ణంరాజు వేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్లను కొట్టేసింది. దీంతో వైసీపీలోనూ, అభిమానుల్లోనూ ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..