- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తగ్గేదేలే.. సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టుకు జగన్ సర్కార్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో : సినిమా టికెట్ ధరల తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తుంది. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 35ను మంగళవారం హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకానికి ధర్మాసనం అనుమతి సైతం ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం బుధవారం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో : సినిమా టికెట్ ధరల తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తుంది. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 35ను మంగళవారం హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకానికి ధర్మాసనం అనుమతి సైతం ఇచ్చింది.
అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం బుధవారం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.
Next Story






